Pages

Search This Blog


Sunday, July 29, 2012

ఆగిన 'కూచిపూడి' పాద ముద్రలు [వెంపటి చినసత్యం]



పరిశ్రమను కాపాడుకోవటానికే ఈ పోటీ...!




                     ఫిల్మ్‌చాంబర్ ఎన్నికల్లో భరద్వాజ్ ప్యానల్ ఘన విజయం

ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి (ఫిల్మ్‌చాంబర్) ఎన్నికలలో తమ్మారెడ్డి భరద్వాజ్ ప్యానల్ ఘన విజయం సాధించింది. పన్నెండు మంది సభ్యులు ఉండే కార్యవర్గం ఎన్నికలలో ఆ ప్యానల్ నుంచి ఏకంగా పదకొండు మంది ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1084 ఓట్లకు గాను 639 ఓట్లు పోలయ్యాయి. పోయిన ఏడాది కంటే ఈసారి రెండు వందల ఓట్లు ఎక్కువ పోలవడం విశేషం. అందరికంటే ఎక్కువగా 472 ఓట్లు పొంది తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రథమ స్థానంలో నిలిచారు.
ఆయన ప్యానల్ నుంచి పోటీ చేసిన టి. ప్రసన్నకుమార్ (461 ఓట్లు), జీవితా రాజశేఖర్ (440), వి. సాగర్ (428), జె.వి. మోహన్‌గౌడ్ (361), టి.ఎస్. విజయచందర్ (336), శాఖమూరి మల్లికార్జునరావు (308), చదలవాడ శ్రీనివాసరావు (303), సి.ఎన్. రావు (302), జ్యోతి ప్రసాద్ (290), యలమంచి రవిచంద్ (288) గెలుపొందారు. ఒక్క కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కేవలం పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ నుంచి కె. అశోక్‌కుమార్ (305 ఓట్లు) ఒక్కరే కార్యవర్గ సభ్యునిగా ఎన్నికవడం గమనార్హం.
ఆ ప్యానల్ నుంచి పోటీచేసిన స్రవంతి రవికిశోర్, సి. కల్యాణ్, దిల్ రాజు, నల్లమలుపు శ్రీనివాస్, డి.వి.వి. దానయ్య, బెక్కెం వేణుగోపాల్, కె.ఎల్. దామోదర్‌ప్రసాద్, మోహన్ వడ్లపట్ల, పల్లి కేశవరావు, సురేశ్ కొండేటి, టి. రామసత్యనారాయణ ఓటమి పాలయ్యారు. కాగా ఫిల్మ్‌చాంబర్ కార్యవర్గ ఎన్నికల్లో ఓ మహిళ పాల్గొనడం, గెలుపొందడం ఇదే ప్రథమం. ఆ ఘనతను జీవిత దక్కించుకున్నారు. ఏడాదిపాటు ఈ కార్యవర్గం బాధ్యతలు  నిర్వ  
 ర్తించ నున్నది.

సినిమాపై 'పన్ను' పడుతోంది